WG: మొగల్తూరులో ICDS ప్రాజెక్ట్ కార్యాలయంలో 201 మంది అంగన్వాడీ టీచర్లకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. అంగన్వాడీ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ ట్యాబ్లు గర్భిణీలు బాలింతలు చిన్నారులకు మరింత సేవలను అందించేందుకు ఉపయోగపడతాయన్నారు.