మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని హాస్టల్ తండా సర్పంచ్ పదవికి ముగ్గురు పోటీ పడ్డారు. 207 ఓట్లతో బాణావత్ జయశ్రీ సర్పంచ్ గెలుపొందారు. తుమ్రం సౌజన్యకు 149 ఓట్లు, మాలవత్ రమేశ్ లకు 17 ఓట్లు వచ్చాయి. గ్రామంలో మొత్తం 437 ఓటర్లు ఉండగా 382 మంది ఓట్లు వేశారు. మొత్తం 87 శాతం ఓట్లు పోలయ్యాయని అధికారులు వెల్లడించారు.