న్యూ చండీగఢ్ వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య రెండో టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు, స్టేడియంలోని రెండు స్టాండ్లకు దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్లు పెట్టారు. ఈ కార్యక్రమానికి పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే, యువరాజ్, హర్మన్ కూడా పాల్గొన్నారు.