WG: జిల్లాలో ఈనెల 21న పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో 0-5 సంవత్సరాల వయసు కలిగిన 1,87,204 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయవలసి ఉందన్నారు. ఇందుకోసం 1,315 పోలియో బూత్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిర్వహణకు 5,520 మంది ఉద్యోగులు విధులకు హాజరు కావాలన్నారు.