TPT: సూళ్లూరుపేట మండలం పెద్దపడవ గ్రామానికి చెందిన రాగల. వెంకటరమణయ్యకు నెల్లూరు పొక్సో కోర్టు జీవిత ఖైదు విధించింది. పోలీసుల కథనం మేరకు.. 2021లో బాలికపై వెంకటరమణయ్య లైంగిక దాడి చేసినట్లు కేసు నమోదు చేశారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన జడ్జ్ సిరిపిరెడ్డి. సుమలత ముద్దాయికి జీవిత ఖైదుతో పాటు రూ.61,500 జరిమానా విధిస్తూ గురువారం తీర్పు చెప్పారు.