WG: ఆకివీడు మండలం అజ్జమూరు గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో యూనిసెఫ్ దినోత్సవాన్ని నిర్వహించారు. పాఠశాల హెచ్ఎంఆర్ వీఎస్ నారాయణ యూనిసెఫ్ విధులను విద్యార్థులకు వివరించారు. టీకాలు వేయడం, పోషకాహార లోపంతో పోరాడటం, బాల్యవివాహాల నిర్మూలన వంటి విధులను యూనిసెఫ్ చూసుకుంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.