కామారెడ్డి మండలం గర్గుల్ సర్పంచిగా చింతల దివ్య రవితేజ గౌడ్ గెలుపొందారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి చింతల దివ్య రవితేజ గర్గుల్ సర్పంచిగా పోటీ చేశారు. గురువారం వెలువడిన ఫలితాల్లో వారు విజయం సాధించడంతో గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. తమకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.