ATP: అహుడ పరిధిలోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం నగరంలోని అహుడా కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్ఆర్ఎస్ కింద వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా పరిష్కరించాలన్నారు.