KKD: దేశంలో ఫర్నిచర్ తయారీ ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ కేంద్రాన్ని కోరారు. గురువారం ఆయన పార్లమెంటులో మాట్లాడారు. గ్లోబల్ మార్కెట్లో నేడు ఫర్నిచర్ రంగం అభివృద్ధి చెందుతోందన్నారు. దీనికి ధీటుగా దేశంలో ఈ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు ఏర్పడతాయన్నారు.