స్థానిక ఎన్నికల ఫలితాలు కొందరికి సంతోషం, మరికొందరికి బాధను మిగిల్చాయి. గెలిచిన అభ్యర్థులు సంబరాలు చేసుకుంటుండగా, ఓడిన అభ్యర్థులు దుఃఖంలో మునిగిపోయారు. ఈ ఎన్నికల కోసం కొందరు అభ్యర్థులు పొలాలు, భూములు అమ్ముకుని భారీగా ఖర్చు చేశారు. దీంతో అభ్యర్థులు ఓటమిని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. అయితే, జీవితంలో గెలుపు, ఓటములు సహజమని గుర్తించి.. జీవితంలో ముందుకు సాగాలి.