ELR: రైలులో ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. లింగపాలెం (M) కలరాయినిగూడెంనకు చెందిన నాగరాజు (45) కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ.. 20 రోజుల క్రితం పెద్ద తిరుపతిలో ఆపరేషన్ చేయించుకున్నాడు. రైలులో నిన్న రాత్రి స్వగ్రామానికి బయలదేరి ఏలూరుకు రాగా నాగరాజులో చలనం లేదు. గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడు.