కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ మండలం పద్మాజీవాడి సర్పంచిగా లోకోటి సుబ్బారావు విజయం సాధించారు. దీంతో పద్మాజీవాడి సర్పంచి స్థానంపై ఉత్కంఠకు తెరపడింది. గురువారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పద్మాజీవాడి ప్రజలు లోకోటి సుబ్బారావు వైపు మొగ్గు చూపారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.