TG: తొలి విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మద్దతుదారుడికి అదృష్టం వరించింది. రంగారెడ్డి(D) కొందుర్గ్(M) చిన్న ఎల్కచెర్ల గ్రామంలో ఉత్కంఠ నెలకొంది. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా 212 ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు రీకౌంటింగ్ నిర్వహించారు. రీకౌంటింగ్‌లోనూ సమాన ఓట్లు రావడంతో టాస్ వేశారు. అందులో కాంగ్రెస్ మద్దతుదారు మరాఠి రాజ్‌కుమార్ విజయం సాధించారు.