ప్రకాశం: కనిగిరి మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో గురువారం ప్రాజెక్టు సమావేశము జరిగింది. సీడీపీవో సరోజినీ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మాతృ వందన యోజనలో అర్హులైన లబ్ధిదారులను ఆన్లైన్లో నమోదు చేసినట్లయితే వారికి ప్రభుత్వం వారి నుంచి అర్హతను బట్టి 5000,6000 నగదు విడుదలవుతుందని తెలియజేశారు. ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్తలు పిల్లల పట్లఅప్రమత్తంగా ఉండాలన్నారు.