TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే, వికారాబాద్ జిల్లాలో ఓటమి తట్టుకోలేక సర్పంచ్ అభ్యర్థి లక్ష్మీ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. కొండగల్ మండలంలోని ఖాజాహైమద్పల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.