భారత్‌పై మెక్సికో భారీ సుంకాలు విధించింది. భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై 50% సుంకాలు విధించబోతున్నట్లు ఆ దేశం ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ టారీఫ్‌లు అమలులోకి రానున్నాయి. ఈ నిర్ణయం భారత్ నుంచి చేసే ఎగుమతులకు ఆర్థికంగా భారం కానుంది. అయితే, ఈ సుంకాలు కేవలం భారత్‌పై మాత్రమే కాదని, ఆసియాలోని అన్ని దేశాలకు కూడా ఇదే రకం సుంకాలు విధిస్తామని తెలిపింది.