WG: ఇంధనాన్ని పొదుపు చేసి భావితరాలకు వనరులను కాపాడాలని కలెక్టర్ నాగరాణి, ఎస్పీ నయీం అస్మీ అన్నారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జాతీయ ఇంధన పొదుపు భాగంగా గురువారం వారోత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈనెల 14 నుంచి వారోత్సవాలు మహోద్యమంగా నిర్వహించాలన్నారు. ప్రజల్లో ఇంధనపరిరక్షణ ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని కోరారు.