MDK: రేగోడ్ మండలం కొండాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బేగరి పాండరి ఒక్క ఓటుతో సర్పంచ్‌గా ఘ ఘన విజయం సాధించారు. గ్రామంలో మొత్తం 620 ఓట్లు ఉండగా 585 ఓట్లు పోలయ్యాయి. అందులో 9 ఓట్లు చెల్లలేదు. ఒక ఓటు నోటాకు పడింది. బేగరి పాండరికి 288 ఓట్లురాగా, అతని సమీప ప్రత్యర్థి BRS పార్టీ మద్దతుతో పోటీ చేసిన హరిజన సత్తయాకు 287 ఓట్లు వచ్చాయి.