మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఆరేపల్లి సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు మేఘజోల్ల రజిత విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి మీద 45 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.