W.G: కేంద్రం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు అంతా ఐక్యంగా పోరాడాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జేఎన్వీ గోపాలన్ పిలుపునిచ్చారు. ఆకివీడులోని రైస్ మిల్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలను తెస్తూ కార్మికుల కష్టజీవుల శ్రమ దోచుకుంటుందన్నారు.