ADB: ఇచ్చోడ మండలంలోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గురువారం జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో దాబా(బీ) గ్రామంలో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు ఈశ్వర్, రామేశ్వర్‌కు సమానంగా 176 ఓట్లు సమానంగా ఓట్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. దీంతో లక్కీ డ్రా ద్వారా ఈశ్వర్‌ను సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగిందని అధికారులు తెలిపారు.