ప్రకాశం: అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన పెంక్షన్స్ మంజూరు చేసి ప్రభుత్వం ప్రజలను ఆడుకోవాలని మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. గురువారం కనిగిరిలోని 12వ సచివాలయమును ఆకస్మికంగా తనిఖీ చేసి మూమెంట్ రిజిస్టర్ హాజరు పట్టికలను తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. అర్హత కలిగిన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలన్నారు.