ASR: సకాలంలో వాక్సిన్ వేయడంతో అంటువ్యాధుల నుంచి కోళ్లను రక్షించుకోగలమని రాజవొమ్మంగి వెటర్నరీ అధికారి తరుణ్ కుమార్ సూచించారు. బలిజపాడులో 200కోళ్లకు గురువారం వాక్సిన్ ఇచ్చామని తెలిపారు. వ్యాధులు బారిన కోళ్లు పడక ముందుగానే ఈ వాక్సిన్ వేయడంతో మంచి ఫలితం ఉంటుందన్నారు. గ్రామ సచివాలయల్లోని వెటర్నరీ అసిస్టెంట్‌కి చెబితే వ్యాక్సిన్ వేస్తారని సూచించారు.