MDK: హవేలి ఘనపూర్ మండలంలోని స్కూల్ తండా గ్రామ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మూడవ గోపాల్ నాయక్ 106 ఓట్లతో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఓట్లు వేసి తనను గెలిపించిన ఓటర్లందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికై అహర్నిశలు కృషి చేస్తానన్నారు. గోపాల్ విజయంతో ఆయన మద్దతుదారులు సంబరాలు జరుపుకుంటున్నారు.