ATP: గుత్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం సీపీఎం నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సీపీఎం మండల కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ.. పట్టణ శివారులోని 327 సర్వే నంబర్లో గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ సూర్యనారాయణకు అందజేశారు.