పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ SIRపై స్పందిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఓటరు జాబితా సవరణలో పేర్లు గల్లంతైతే ఊరుకోవద్దని, వంట గదిలో ఉండే సామాన్లతో రెడీగా ఉండాలని మహిళలకు పిలుపునిచ్చారు. ఢిల్లీ పోలీసులను చూసి భయపడొద్దని, మీ చేతిలో ఉండే గరిటెలే మీ ఆయుధాల్ని అన్నారు. బీజేపీ బయటి వాళ్లను తెచ్చి బెదిరిస్తోందని, మహిళలే ముందుండి పోరాడాలని దీదీ సూచించారు.