ప్రకాశం: ఒంగోలు నగరంలో రూ. 5 కోట్ల వ్యయంతో గురువారం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కూటమీ అధికారంలోకి వచ్చాక రూ. 120 కోట్ల పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, రూ. 700 కోట్ల పైగా రోడ్ల విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసామన్నారు. త్వరలో రోడ్లు నిర్మించి సుందరీకరణ చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.