SRPT: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఆత్మకూరు ఎస్ మండలం దుబ్బ తండా సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇక్కడ టీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన జాటో సత్యవతి రవీందర్ ఘన విజయం సాధించారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై సత్యవతి రవీందర్ ఏకంగా 44 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆమె విజయం పట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.