అనారోగ్యంతో మనస్తాపం చెంది ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగులో జరిగింది. పోలీసులు, మృతుడి తల్లి వివరాల ప్రకారం… ఏపీలోని బాపట్ల జిల్లా చీరాలకు చెందిన నక్క రామకృష్ణ(40)ములుగులో జ్యూస్ పాయింట్ తో పాటు మిర్చి, బజ్జీల బండి నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తీవ్ర మనస్తాపానికి గురై గురువారం ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు.