బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ చిత్రాన్ని RSS చీఫ్ మోహన్ భగవత్ వీక్షించారు. ఢిల్లీలో ఆయన కోసం చిత్ర బృందం ప్రత్యేక షో ఏర్పాటు చేసింది. డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఆ చిత్ర నిర్మాతలు కూడా ఆయనతో పాటు ఈ సినిమాను చూశారు. అనంతరం మోహన్ భగవత్, సినిమా చాలా బాగుందంటూ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా, సినిమాలో బాలయ్య పాత్రను ఆయన ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.