BHNG: రాజాపేట మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలో BRS, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ఓట్లు సమానంగా పోలయ్యాయి. BRS బలపరిచిన అభ్యర్థి ఇండ్ల రాజయ్యకు 148 ఓట్లు రాగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి వేముల సురేందర్ రెడ్డికి సైతం 148 ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు లక్కీ డ్రా తీయగా BRS అభ్యర్థి ఇండ్ల రాజయ్య గెలుపొందారు. BRS నేతలు హర్షం వ్యక్తం చేశారు.