BHPL: ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటికీ, జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమలులో కొనసాగుతుందని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. మూడు దశల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు విజయోత్సవ ర్యాలీలు, సభలు, బైక్ శోభాయాత్రలు, డీజే వంటి వేడుకలకు అనుమతి లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.