ప్రకాశం: టంగుటూరు మండలం వల్లూరు సమీపంలో జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొబ్బరి బొండాల లోడుతో వెళ్తున్న ఆటోను ఒక కంటైనర్ ఢీకొనడంతో, ఆటో డివైడర్ను ఢీకొని రోడ్డుపై కొబ్బరి బోండాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.