AP: జీవితంలో విలువలు ఎంతో ముఖ్యమని.. వాటిని విద్యార్థులు ఆచరించాలని మంత్రి లోకేష్ అన్నారు. గుంటూరులోని ఎర్రపాలెంలో ఉన్న డాన్ బాస్కో పాఠశాల స్వర్ణోత్సవాలకు హాజరైన ఆయన మాట్లాడారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నా తమకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను ఎప్పటికీ మరువకూడదని సూచించారు.