VSP: మార్గశిర మాసోత్సవాలు, రెండో శనివారం కావడంతో బురుజుపేటలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.