HYD: కూకట్ పల్లి PS పరిధిలోని మూసాపేట్లో విషాదం జరిగింది. నవ వధువు చందన జ్యోతి(24) ఆత్మహత్యకు పాల్పడింది. ప్రొద్దుటూరుకు చెందిన జ్యోతికి, కొత్తగూడెంకు చెందిన యశ్వంత్‌కు మూడు నెలల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరుగుతుండటంతో మనస్తాపానికి గురై జ్యోతి ఇవాళ బెడ్రూమ్లో ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.