అనంతపురంలో రూ.1.40 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించినట్లు MLA దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. రాంనగర్ పార్కు వద్ద రూ. 82 లక్షలతో సీసీ రోడ్డు, శ్రీకంఠం సర్కిల్ వద్ద రూ. 40 లక్షలతో సీసీ డ్రైన్‌కు భూమి పూజ చేశారు. రూ. 20 లక్షలతో నిర్మించిన ఉమానగర్ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాదిన్నరలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తున్నామని తెలిపారు.