GNTR: మంగళగిరి డాన్ బోస్కో ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ వేడుకల్లో మంత్రి లోకేశ్ శనివారం పాల్గొన్నారు. విద్యతో పాటు విలువలు ముఖ్యమని, తన ఎదుగుదలకు ఉపాధ్యాయులే కారణమని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్వర్ణోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించి, పాఠశాలలో కొత్త సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించారు. అలాగే పాఠశాల వ్యవస్థాపకులు ఫాదర్ తోమస్ చిన్నప్ప విగ్రహానికి నివాళులర్పించారు.