విశాఖపై సీఎంకు ప్రత్యేక అభిమానం ఉందని, రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే కేంద్రబిందువుగా దీనిని భావించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖలో శనివారం మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు ఎకనామిక్ రీజియన్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊతమన్నారు.