GNTR: రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నూతనంగా ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 16వ తేదీ నుంచి లాంఛనంగా శిక్షణ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను శనివారం హోం మంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. డీఐజీ ఏసుబాబు, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తో కలిసి ఏర్పాట్లను సమీక్షించి అధికారులకు సూచనలు, సలహాలు అందించారు.