NLR: కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలను నెల్లూరులోనే కొనసాగించాలనే ప్రతిపాదన ZPTC సభ్యులు ఆమోదించారు. ఈ సమావేశంలో కలువాయి ZPTC అనిల్ కుమార్ రెడ్డి తమ మండలాన్ని తిరుపతిలో కలపడం వల్ల వచ్చే ఇబ్బందులను ఛైర్మన్ అరుణమ్మకు వివరించారు. నిర్ణయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించగా, అరుణమ్మ, సీఈవో శ్రీధర్ రెడ్డి దీనిని ప్రభుత్వానికి పంపే హామీ ఇచ్చారు.