HYD: లంగర్ హౌస్ PS పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. లంగర్ హౌస్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో 5 లీటర్ల హ్యాష్ ఆయిల్, 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన సొత్తు విలువ సుమారు రూ.70 లక్షలు ఉంటుందని అంచనా, ఈ కేసులో అంతర్రాష్ట్ర హ్యాష్ ఆయిల్ నిందితుడితో సహా మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.