కృష్ణా: గూడూరు గ్రామంలో NTPC వారి CSR నిధులు రూ. 65 లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటి హాల్‌ను ఎంపీ వల్లభనేని బాలశౌరి శనివారం ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ.. రాబోయే కాలంలో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్, మచిలీపట్నం జనసేన పార్టీ ఇంఛార్జ్ బండి రామకృష్ణ, కూటమి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.