VZM: పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 4వ పారా రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు ఇవాళ స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిధిగా హాజరైన మాజీ ఎంపీ డాక్టర్. డీవీజీ శంకర రావు పోటీలను ప్రారంభించారు. సంకల్పం ఉంటే సాధించలేనిది ఏది ఉండదని దివ్యాంగ క్రీడాకారులు నిరూపిస్తున్నారని అన్నారు.