MHBD: తొర్రూరు మండల వ్యాప్తంగా ఆదివారం పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్సై ఉపేందర్ తెలిపారు. పోలింగ్ స్టేషన్కు 200 మీటర్ల లోపు అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు పార్టీ జెండాలు, గుర్తులు ప్రదర్శించొద్దన్నారు. ఓటర్లు ఓటు వేసిన వెంటనే పోలింగ్ స్టేషన్ వదిలి వెళ్లాలన్నారు.