AKP: నర్సీపట్నం పెద్ద బొడ్డుపల్లి శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో ఇవాళ భగవద్గీత పోటీలు నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో పాల్గొనడానికి చిన్నారులు పోటీపడ్డారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ కేటగిరీలలో జరిగిన పోటీలలో విజేతలను జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలో పోటీ పడతారు. ఆలయ కమిటీ చైర్మన్ బాబురావు మాస్టర్ పాల్గొన్నారు.