ASR: డుంబ్రిగూడ మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన చాపరాయి జలపాతం శనివారం సందర్శకులతో కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచే కుటుంబ సమేతంగా భారీ సంఖ్యలో పర్యాటకులు చేరుకొని జలపాతంలో స్నానాలు చేస్తూ కేరింతలు కొడుతూ సందడి చేశారు. ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ కొందరు గిరిజన సంప్రదాయ వస్త్రధారణలో ఫోటోలకు ఫోజులిస్తున్నారు.