KNR: రెండవవిడతలో ఆదివారం నిర్వహించనున్న గ్రామపంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికలు-2025లో భాగంగా జిల్లాలో రెండవ విడత పోలింగ్ తిమ్మాపూర్ మండలం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పరిశీలించారు.