ASR: పర్యాటక ప్రాంతాల్లో నాణ్యతలేని తినుబండారాల విక్రయాలు చేపడితే కఠిన చర్యలు చేపడతామని జీ.మాడుగుల డిప్యూటీ ఎంపీడీవో సన్యాసిరావు హెచ్చరించారు. శనివారం కొత్తపల్లి జలపాతం ఆవరణలో తనిఖీ చేశారు. అక్కడ విక్రయిస్తున్న వివిధ తినుబండారాలను పరిశీలించారు. నాణ్యతలేని, కాలం చెల్లిన వస్తువులను గుర్తించారు. చికెన్ వంటకాల్లో అధికంగా ఎరుపు రంగు వాడుతున్నట్లు గుర్తించారు.