WGL: సంగెం మండలంలో ఏర్పాటు చేసిన పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఇవాళ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సందర్శించారు. ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా చర్యలు, సిబ్బంది సమన్వయం తదితర అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.